Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను వచ్చే వరకూ రేవంత్ అధికారాలు, హోదా కట్: స్పష్టం చేసిన చంద్రబాబు

  • ఎల్ రమణకు ఫోన్ చేసిన చంద్రబాబు
  • రేవంత్ కు ఉన్న ఎల్పీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అధికారాలు కట్
  • ఎలాంటి సమావేశాలూ నిర్వహించేందుకు వీల్లేదు
  • అవి టీడీపీ సమావేశాలుగా భావించవద్దు
  • వచ్చిన తరువాత తుది నిర్ణయం: బాబు
రేవంత్ ను తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ రాసిన లేఖపై చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రస్తుతం లండన్ లో ఉన్న ఆయన, ఎల్ రమణకు ఫోన్ చేసి మాట్లాడారు. తాను తిరిగి వచ్చేంత వరకూ టీఎస్ టీడీపీఎల్పీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ కు ఉన్న అధికారాలన్నిటినీ తొలగిస్తున్నట్టు చెప్పారు. పార్టీకి సంబంధించిన సమావేశాలు రేవంత్ రెడ్డి నిర్వహించరాదని ఆదేశించారు.

పార్టీ తరఫున ఏవైనా సమావేశాలు నిర్వహించాలని భావిస్తే, రేవంత్ రెడ్డిని ఓ ఎమ్మెల్యేగా మాత్రమే భావిస్తూ ఆహ్వానించాలని సూచించారు. ఆయన అధ్యక్షతన ఎలాంటి సమావేశాలనూ అనుమతించేది లేదని, అవి పార్టీ సమావేశాలుగా గుర్తించవద్దని చంద్రబాబు ఆదేశించారు. తాను వచ్చిన తరువాత అన్ని అంశాలనూ పరిశీలిస్తానని, ఆ తరువాత తుది నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు పేర్కొన్నట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
revant reddy
congress
l ramana
Telugudesam
chandrababu

More Telugu News